24 May, 2026 | 2:30 PM

Breaking News

140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •   ఘనంగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా 2వ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026   •   మండలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్   •   విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు   •   పంట వ్యర్థాల దగ్ధంతో ఆందోళనలో పల్లె ప్రజలు   •   శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు   •   కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు   •   నీలోఫర్ కేఫ్ పరిధిలో రెచ్చిపోయిన ఆకతాయిలు   •  

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నీచరాజకీయం

03-01-2026 12:05 AM
  1. కృష్ణా జలాలపై.. ఒకరిపై ఒకరు విమర్శలు
  2. ‘జాతీయ అబద్ధాల పోటీలు’ నిర్వహిస్తే వారికే అవార్డులు
  3. కేంద్రమంత్రి బండి సంజయ్

హైదరాబాద్, జనవరి2 (విజయక్రాంతి): కృష్ణా జలాల వాటా వినియోగంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పచ్చి అబద్ధాలాడుతూ, నీచరాజకీయం చేస్తూ కేంద్రాన్ని దూషించడం అలవాటుగా చేసుకున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. అందాల పోటీల మాదిరిగా హైదరాబాద్‌లో ‘జాతీయ అబద్ధాల పోటీలు’ నిర్వహిస్తే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు మొదటి రెండు అవార్డులు దక్కుతాయనడంలో ఎలాంటి సందేహమూ లేదని విమర్శించారు.

నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సింది పోయి ప్రజలను గందరగోళంలోకి నెట్టి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు నీచరాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటను విడుదల చేస్తూ... ప్రజా సమస్యల పరిష్కారం కావాల్సిన పవిత్రమైన అసెంబ్లీని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సిగ్గు చేటన్నారు. 299 ఈఎంసీలు చాలని ఆయనే ఒప్పుకున్నారని కేసీఆర్‌ను విమర్శించారు. నదీ జలాల విషయంలో కేంద్రం పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.