నల్గొండ,(విజయక్రాంతి): బీఆర్ఎస్ ఆందోళనతో నల్గొండ మున్సిపల్ కార్యాలయం(Nalgonda Municipal Office) వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఫ్లెక్సీలు తొలగించడంపై ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్(BRS) నేతలు ఫ్లెక్సీలు ఎందుకు తొలగించారంటూ మున్సిపల్ కమిషనర్ ను నిలదీశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ చాంబర్ లో బీఆర్ఎన్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కార్యకర్తలు బైఠాయించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.మున్సిపల్ కమిషనర్ చాంబర్ లోకి ఎలా వస్తారంటూ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.
ఈ నేపథ్యం బీఆర్ఎస్ నేతలను కార్యాలయం నుంచి బయటకు పంపించేందుకు ఎంత ప్రయత్నించిన వెళ్లాలేదు. అదే క్రమంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ శ్రేణులు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కాస్తా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అనంతరం కాంగ్రెస్-బీఆర్ఎస్ నాయకులు పరస్పరం పూలకుండీలు విసురుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టు చేశారు. జిల్లాలో బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఇంటికొచ్చి కొడతామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. పోలీసులపై కంచర్ల భూపాల్ రెడ్డి దర్బాషలాడారు. ఎన్నిసార్లు అసభ్యకరంగా మట్లాడిన ఓపిక పట్టిన్నాం. కానీ ఇకపై ఉరుకునేదేలే అంటూ.. కంచర్ల భూపాల్ రెడ్డిని ఒక మెంటల్ కృష్ణ అని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు.