05-04-2025 01:54:30 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఆ రెండు పార్టీల మధ్య ఫెవికాల్ బంధం కొనసాగుతోందని శుక్రవారం ఆయన ప్రకటనలో ఆరోపించారు. అందుకే జీహెచ్‌ఎంసీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టకుండా మజ్లిస్ అభ్యర్థికి మద్దతుగా నిలిచాయని ఆ రోపించారు.
డీలిమిటేషన్ పేరుతో మొన్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటయ్యాయన్నారు. త్వరలో తెలంగాణలో కలిసే బహిరంగ సభను నిర్వహించబోతున్నాయన్నారు. పార్లమెం టులో వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుపై నిర్వహిం చిన ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్, బీ ఆర్‌ఎస్ ఒక్కటై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాయన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబాన్ని తాము అధికారంలోకి రాగానే జైలుకు పంపుతామని, ఇప్పుడు డబ్బు సంచులకు అమ్ముడుపోయి బీఆర్‌ఎస్‌తో కుమ్కక్కై, అవినీతి కేసులన్నీ నీరుగారుస్తున్నారని ఆరోపించారు. బీసీ జాబితా ముసుగులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంవల్ల తీ రని అన్యాయం జరగబోతోందన్నారు.