అవినీతి బయటపడాలంటే సీవీసీ విచారణ కోరాలి
లేదంటే కాంగ్రెస్ సర్కార్ అవినీతికి పాల్పడినట్లే
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రా ంతి): దేశంలోని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పించాలనే సదుద్దేశంతో మోదీ ప్రభుత్వం అమృత్ పథకాన్ని ప్రవేశపెడితే.. గత బీఆర్ ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్దఎత్తు న అవినీతికి పాల్పడుతూ.. ఈ పథకం ప్ర యోజనాలు ప్రజలకు అందకుండా చేస్తు న్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
ఈ పథకంలో అవినీతి జరిగిందని ఈ రెండూ పార్టీలు ఒక దానిపై మరొకటి ఆరోపణలు గుప్పించుకుం టూ డ్రామాలు ఆడుతున్నాయన్నారు. ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్.. తమ పాలనలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్ సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటు న్నాయన్నారు. దొంగలు దొంగలు ఊళ్లు పం చుకున్నట్లు ఈ రెండు పార్టీలు పథకంలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడి, తమకు కావా ల్సిన వాళ్లకు కాంట్రాక్టులు ఇప్పించి భారీ స్థాయిలో కమీషన్లు కొట్టేశాయన్నది వాస్తవ మన్నారు.
ఈ స్కీంలో చోటుచేసుకున్న అవి నీతిని వెలికితీయాలన్నా... బీఆర్‌ఎస్, కాంగ్రె స్ ఆరోపణల్లో నిజానిజాలు బయటకు రా వాలన్నా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ ) ఆధ్వర్యంలో విచారణ జరిపించాలన్నారు. అమృత్ పథకంలో జరిగిన అవినీతిపై విచా రణ కోరుతూ రాష్ర్ట ప్రభుత్వం సీవీసీకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. రాష్ర్ట ప్రభు త్వం లేఖ సమర్పిస్తే విచారణ జరిపేందుకు సీవీసీని ఒప్పించేలా తాను చొరవ తీసు కుంటానన్నారు. లేఖ రాయని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్టు భావించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.