calender_icon.png 4 April, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రచారానికి పరిమితమైన కాంగ్రెస్, బీజేపీ నేతలు

31-03-2025 12:00:00 AM

మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, మార్చ్ 30 (విజయక్రాంతి): జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ నాయకు లు కేవలం హోర్డింగ్‌ల ద్వారా ప్రచారానికే పరిమితమయ్యారు తప్ప ప్రజా సంక్షేమం పై దృష్టి సారించడం లేదని  మాజీ మంత్రి,  జోగు రామన్న ఫైర్ అయ్యారు. స్థానిక బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వివిధ కాలనీలకు చెందిన 200 మంది బీజేపీ, కాంగ్రెస్ యువకులు రామన్న సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.   అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ  ఉగాది పర్వదినాన పలువురు యువకులు కాంగ్రెస్, బీజేపీ లపై  అసహనాన్ని వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్ లోకి రావడం శుభ పరిణామం అన్నారు.  ప్రజా సంక్షేమానికి పని చేయాల్సిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజలపై బెదిరింపులకు పాల్పడటం తగదన్నారు.