పంట కొనుగోళ్లకు రాజకీయరంగు
కాంగ్రెస్ బిజెపి పరస్పర విమర్శలు
ధాన్యం కొనుగోళ్లలో రెండు పార్టీల ధన్వ వైఖరి
రైతుల పేరుతో ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు
కొనుగోళ్ల సందర్శన పేరుతో కొత్త డ్రామా
నిర్మల్ మే 24 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో రాజకీయ పార్టీల కొత్త డ్రామా ప్రారంభమైంది. ఎన్నికలప్పుడే రాజకీయాలు తర్వాత ప్రజా సంక్షేమ తమ ముఖ్య లక్ష్యం అని గొప్పలు చెప్పే పార్టీ నేతలు ప్రస్తుతం పంట కొనుగోళ్లకు రాజకీయరంగులు కులముతున్నారు. ఒకవైపు రైతులు పండించిన మొక్కజొన్న జొన్న వరి పంటలు పంటల కొనుగోలు తీవ్ర జాప్యం జరిగి రైతులు ఇబ్బంది పడుతుంటే రాజకీయ పార్టీల నేతలు మాత్రం పరామర్శల పేరుతో పంట కొనుగోలను రాజకీయ ఉనికి కోసం విమర్శలు చేస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో గత 15 రోజుల నుంచి నిర్మల్ ముధోల్ ఖానాపూర్ నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షాలైన బిజెపి టిఆర్‌ఎస్ పార్టీల నేతలు పంట కొనుగోలు కేంద్రాల సందర్శన రైతుల పరామర్శ పేరుతో గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో తాము ఇన్ని కష్టాలు పడి పంటను అమ్ముకోవడానికి ప్రస్తారోకోలు చేసిన పట్టించుకోని పాలకులు ఇప్పుడు పరామర్శల పేరుతో పంట కొనుగోలు కేంద్రాలకు రావడం పై చాలా గ్రామాల్లో రైతులు ప్రజాప్రతినిధుల ముందే తమ వెళ్లకకుతున్నారు
జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి
నిర్మల్ జిల్లాలో ఈ యాసంగి సీజన్లో మొక్కజొన్న జొన్న వరి పంటలు రైతుల చేతికి రావడంతో ప్రభుత్వ మద్దతు ధర కో సం మొదటగా కొనుగోలు కేంద్రాల ప్రారంభమై డ్రామా కొనసాగింది. నిర్మల్ జిల్లాలో నిర్మల్ ముధోళ్ళు బిజెపి ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్, ప్రాతినిధ్య వై స్తుండగా ఖానాపూర్ లో అధికార పార్టీ ఎ మ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ ప్రాథమిక వహిస్తున్నారు.
అయితే పంట కొనుగోలు కేంద్రాల మంజూరులో ప్రభుత్వం పంట సా గు ఆధారంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కొనుగోలు కేం ద్రాలను తామే మంజూరు చేసామని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతుండగా ప్రతిపక్ష పార్టీలు తాము ఎమ్మెల్యేగా మం జూరు చేశామని ఇందులో కాంగ్రెస్ నాయకుల ప్రమేయం లేదని విమర్శలకు దిగారు. ఇక పంట కొనుగోలు అధికార పార్టీ నిర్లక్ష్యంతోనే పంట కొనుగోలు ఆలస్యం అవుతున్నాయని ప్రతిపక్ష ఎమ్మెల్యేలైన మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్ ఖానాపూర్ లో టిఆర్‌ఎస్ నియోజకవర్గ జాన్సన్ నాయ క్ ఆరోపిస్తున్నారు.
దీన్ని కాంగ్రెస్ నాయకులు తిప్పికొడుతూ ప్రభుత్వం మాది మీరు ఎట్లా మంజూరు చేస్తారంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికై పంట కొనుగోలను ప్రారంభించి ఆ తర్వాత చేతులెత్తేస్తున్నారని ఎదురుదాడికి దిగుతున్నారు. పంటలు నిల్వలు పేరుకుపోయిన స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా కనీసం జిల్లా స్థాయిలో ఇప్పటివరకు సమీక్ష చేయలేదని పరస్పరం విమర్శించుకుంటున్నారు.
వారం రోజుల నుంచి నిర్మల్ జిల్లాలో జిల్లా స్థాయి నేతలు మండల స్థాయి నేతలు గ్రామస్థాయి నేతలు పోటాపోటీగా పంట కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులను పరామర్శ పేరుతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొని సోషల్ మీడియాలో వాటిని వైరల్ చేస్తూ తమ రాజకీయ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారు. కొంద రు నేతలు ప్రతిరోజు జిల్లా అధికారులను కలిసి ఓ వినతిపత్రం ఇచ్చి సోషల్ మీడియా లో ప్రచారం చేసుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వారు చేసింది ఏమీ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల పంత మార్చారు
నిర్మల్ జిల్లాలో పంట కొనుగోలు కేం ద్రాల్లో దాన్యం నిల్వలు పెరిగిపోయిన నేపథ్యంలో రైతులు నష్టపోకుండా కొత్త పంతా లు ఎన్నుకున్నారు. ఆయా కొనుగోలు కేం ద్రాలు రైతులందరూ పార్టీలకతీతంగా సం ఘటితమై ప్రైవేటులో సంచులు కొనుగోలు చేసి కూలీలను రప్పించుకొని అద్దె లారీలను తెప్పించుకొని పంటను తూకం వేసి లారీల్లో తరలిస్తూ తమ పంటను అమ్ముకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ప్ర భుత్వపరంగా కూలీల కొరత లారీల కొరత సంచుల కొరత తీవ్రంగా ఉండడంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రైతు లు రోడ్లపైకి వచ్చి మూల్యకంచెలు వేసి చెట్లు నరికి బయట నుంచి వంటావార్పులు చేసుకుని నిరసన తెలుపుతున్నారు. ఆ ప్రాంతా లకు ఏ నాయకుడు వెళ్లడం లేదు. ఎందుకం టే అక్కడికి వెళ్తే రైతుల చేత ఏ తిట్లు తిరాల్సి వస్తుందని భయంతో మిన్నంటే ఉంటున్నారు.
దీంతో రైతులు పంటను ఎట్టి పరిస్థితుల్లో వికరించుకునే ఉద్దేశంతో కుంటాలకు 200 అదనపు ఖర్చులు భరించి సంచులు, కూలీల చార్జీ లారీ కిరాయితో పంటను త్వరగా విక్రయించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరో వారం రోజుల్లో మృగ శిర కార్తె వానకాల సీజన్ ప్రారంభం కాను న్న నేపథ్యంలో అప్పటివరకు పంటను విక్రయించుకుంటే వానాకాలం పెట్టుబడికి డ బ్బులు వస్తాయని ఆశతో రైతులు పడరాన్ని పాటుపడుతూ పంట కొనుగోలు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు.






