calender_icon.png 25 September, 2024 | 3:58 AM

‘అమృత్’లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు

25-09-2024 01:51:55 AM

బీఆర్‌ఎస్ నేత రావుల 

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): కేంద్ర మంత్రి బండి సం జయ్, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి అమృత్ స్కాంపై స్పందించిన తీరు హాస్యాస్పదంగా ఉందని బీఆర్‌ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగా ణ భవన్‌లో మీడియాతో మాట్లాడు తూ.. రాష్ర్ట ప్రభుత్వం కేంద్ర విజిలెన్సు కమిషనర్‌కు లేఖ రాయాలని కోరడం విచిత్రంగా ఉందన్నారు.

రాష్టంలోని కాంగ్రెస్ పెద్దలను కాపాడే పనిలో బండి సంజయ్ ఉన్నట్టు అర్థమవుతోందని, అలాంటి వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉండటం దురదృష్టకరమని అన్నారు. అమృత్ పథకం మీద మహేశ్వర్‌రెడ్డి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని, ఇపుడు సీబీఐ విచారణ కోరాలని రాష్ట్రాన్ని కోరడం సరికాదని అన్నారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది గడ్డి పీకేందుకే నా? అని శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీని చూసి తెలంగాణ బీజేపీ నేర్చుకోవాలని సూచించారు.

అక్కడ కాంగ్రెస్ అవినీ తి మీద బీజేపీ ఉద్యమిస్తుంటే.. తెలంగాణలో మాత్రం ఏమీ పట్టనట్లు, నోరు మూసుకుందని ఆరోపించారు. ఎమ్మెల్యే బొజ్జు బీజేపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినా ఇక్కడి బీజేపీ నేతలు మౌనంగానే ఉన్నారని శ్రీధర్‌రెడ్డి గుర్తుచేశారు.