12-02-2025 02:07:22 AM
* మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
తిమ్మాపూర్,ఫిబ్రవరి11(విజయక్రాంతి): త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారా యణ పిలుపునిచ్చారు. మంగళవారం తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో బోధ నా, బోధనేతర సిబ్బందితో నిర్వహించిన సమాశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజర య్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల కరీంన గర్, ఆదిలాబాద్ , నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఎమ్మల్సీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పట్టభద్రు లంతా కలిసికట్టుగా కృషి చేయాలని కోరా రు. పట్టభద్రుల సమస్యలపై పరిపూర్ణ అవగాహన కలిగిన నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ గా వారి సమస్యలు పరిష్కరిస్తారనే ఆశాభా వాన్ని ఆయన వ్యక్తం చేశారు.
సమావే శంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, ఒగ్గు దామోదర్, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస రావు, సిరిగినేని కొండల్ రావు, కొత్త తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.