calender_icon.png 23 January, 2025 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు

23-01-2025 12:39:43 PM

హైదరాబాద్: పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(Patancheru MLA Gudem Mahipal Reddy) క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కుర్చీలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. పటాన్ చెరు కూడలిలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మరో వర్గం హైవేపై ధర్నా చేసింది. పెద్ద ఎత్తులో కాంగ్రెస్ కార్యకర్తలు(Congress workers) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి తరలివచ్చారు. క్యాంపు కార్యాలయానికి గేటు వద్ద పోలీసులు కార్యకర్తలను అడ్డుకున్నారు. ముగ్గురు కార్యకర్తలు క్యాంపు కార్యాలయం గోడ దూకి లోపలికి వెళ్లారు. క్యాంపు కార్యాలయంలో ఉన్న కుర్చీలను ధ్వంసం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)కి అనుకూలంగా నినాదాలు చేశారు.

పటాన్‌చెరులో గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్(Kata Srinivas Goud) అనుచరులు నిరసన చేస్తున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ క్యాడర్ నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో పటాన్‌చెరు చౌరస్తా వద్ద పోలీసులు మోహరించారు. సేవ్ కాంగ్రెస్.. సేవ్ పటాన్‌చెరు స్లోగన్(Save Congress.. Save Patancheru Slogan) తో  కార్యకర్తలు, నాయకులు రోడ్డెక్కారు. పార్టీ మారి వచ్చిన గూడెం తన అనుచర వర్గం కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని బొల్లారంలో పాత కాంగ్రెస్ నాయకులను గూడెం మహిపాల్ రెడ్డి బూతులు తిట్టినట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఆగ్రహించిన నేతలు సేవ్ కాంగ్రెస్.. సేవ్ పటాన్‌చెరు నినాదంతో నిరసనకు దిగారు. పాత కొత్త నేతల పంచాయతీ సర్దుబాటు చేయాలని పటాన్ చెరు కాంగ్రెస్ కీలక నేతలు డిమాండ్ చేస్తున్నారు.