calender_icon.png 17 March, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10వ తరగతి విద్యార్థులకు అభినందన సభ

17-03-2025 12:25:50 AM

నిజామాబాద్ మార్చ్ 16: (విజయ క్రాంతి) :గత పరీక్షల్లో పదో తరగతి విద్యార్థులు వచ్చిన ప్రతిభ నువ్వు ప్రశంసిస్తూ యుఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం  విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే రకంగా ప్రతిభా పరీక్షలు నిర్వహించడం చాలా అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్  అన్నారు.

అదే రకంగా ఈ ప్రతిభా పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అందరూ కూడా రానున్న పదవ తరగతి పరీక్షల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆయన సూచించారు. యుఎస్‌ఎఫ్‌ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  ప్రెస్ క్లబ్ లో యు ఎస్ ఎఫ్ ఐ ఆద్వర్యంలో గత నెల 16వ తేదీన నిర్వహించిన పదవ తరగతి ప్రతిభా పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించి, బహుమతులు అందజేశారు.

ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ హాజరై మాట్లాడుతూ, అదే రకంగా రానున్న పదవ తరగతి బోర్డు పరీక్షలను ప్రశాంతత వాతావరణంలో రాయాలని, ఉజ్వలమైన భవిష్యత్తుకు మొదటి మెట్టుగా ఈ పదవ తరగతి ఉపయోగపడుతుందని కాబట్టి విద్యార్థులందరూ ఇప్పుడున్న సమయాన్ని పూర్తిగా వినియోగించు కోవాలని తెలియజేశారు.

అదే రకంగా మాజీ విద్యార్థి సంఘ నాయకులు, అడ్వకేట్ అన్వేష్, యుఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పెద్ద సూరి మాట్లాడారు. గత నెల 16వ తేదీన నిజాంబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 3,000 మంది విద్యార్థులతో యూఎస్‌ఎఫ్‌ఐ ప్రతిభా పరీక్షను నిర్వహించడం జరిగిందని ఆ పరీక్షల్లో  వివిధ స్కూల్స్ నుండి దాదాపు 40 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతికి ఎంపిక చేయడం జరిగిందని అన్నారు.  యూఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు గణేష్ పోషమైన మహేష్, యుఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు దుర్గా, వేణు, బాబురావు  పాల్గొన్నారు.