హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినం దనలు తెలిపారు. వైద్య రంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కి అవార్డు రావడం ఎంతో సంతోషకరమన్నారు. ఇక అవార్డులు వచ్చిన మిగతా వారికి సీఎం అభినందనలు తెలియజేశారు. వారి అంకిత భావమే అవార్డులకు ఎంపికయ్యేలా చేసిందని తెలిపారు.
తెలంగాణ ప్రజలకు అవమానం..
పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అవమానం జరిగిందని ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్, చుక్కా రామయ్య, అందె శ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు వంటి ప్రముఖులను కేంద్ర ప్రభు త్వం పరిగణనలోకి తీసుకోకపోవడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ను అవమానించడమేనని సీఎం అసంతృప్తి వ్య క్తం చేశారు.
మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై సీ ఎం చర్చించారు. తెలంగాణకు పద్మ పురస్కారాల్లో జరిగిన అన్యాయంపై ప్రధానికి లేఖ రాయాలనే యోచనలో సీఎం ఉన్నారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారిని గుర్తించకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనని సీఎం పేర్కొన్నారు.