10-04-2025 01:25:16 AM
వనపర్తి టౌన్ ఏప్రిల్ 9: మున్సిపాలిటీ ఆదాయం పెంచడంలో శ్రమించిన సిబ్బంది జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ ప్రత్యేక అధికారి ఆదర్ష్ సురభి అభినందించారు.2023-24 లో రూ. 4.43 కోట్లు ఆస్తి పన్ను వసూలు కాగా, 2024-25 లో రూ.5.55 కోట్లు వసూళ్లు చేశారన్నారు.వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూలులో సిబ్బంది 2024-25 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పనితీరు కనబరిచారు. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25 లో ఆస్తి పన్నులు రూపాయలు కోటికి పైగా అదనంగా వసూలు చేసి మున్సిపాలిటీ ఆదా యం పెంచారు. అదేవిధంగా నిర్దేశించిన లక్ష్యంలో 50.78% లక్ష్యాని సాధించగలిగారు అన్నారు.
-ఎన్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ వనపర్తి
ఈ ఏడాది పన్నుల వసూళ్లు చేయడంలో వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, మిగతా మున్సిపల్ సిబ్బంది బాగా శ్రమించారు. 19 బృందాలను ఏర్పాటు చేసి పన్నుల బకాయి దారులు అందరికీ నోటీసులు అందజేయడం, మైక్ ఆటోల ద్వారా అనౌన్స్మెంట్ చేయించడం, వినియోగదారుల ఫోన్లకు బల్క్ మెసేజ్లు పంపించడం వంటివి చేయడం జరిగింది. ఇవే కాకుండా పట్టణం యందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, శానిటేషన్ వాహనాల ద్వారా పన్ను చెల్లింపుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది. పన్నుల వసూళ్లలో వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు ఉదయం నుంచి రాత్రి దాకా బాగా శ్రమించారానీ వారినీ అభినందించారు.