07-03-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, మార్చి 6: సిజెరియను సెక్షన్ సర్జరీని విజయవంతంగా జిల్లా ఆసుపత్రిలో నిర్వహించినందుకు గాను వైద్య బృందాన్ని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అభినందిస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాటారం మండలానికి చెందిన సంధ్య నెలలో నిండిన గర్భిణీ, ఆమె కు ప్లేట్ లెట్స్ 74 వేలు మాత్రమే ఉండడం గమనించిన వైద్యులు సకాలంలో స్పందించి పేషంట్ బంధువులకు కౌన్సిలింగ్ నిర్వహించి కావాల్సిన జాగ్రత్తలతో గురువారం సిజీరియన్ సెక్షన్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్సను విజయవంతగా నిర్వహించిన డాక్టర్ అనసూయ ,డాక్టర్ రామం, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ డాక్టర్ల బృందాన్ని, ఆసుపత్రి సిబ్బందిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
దంత వైద్య దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ప్రజలకు సేవలు అందిస్తున్న దంత వైద్యులు డాక్టర్ విజయ్ మరియు డాక్టర్ సుస్మిత, సీనియర్ డాక్టర్లు, ఆర్.ఎం.ఓ లకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఆసుపత్రి లో మాతా శిశు ఆసుపత్రిలో వివిధ రకాల స్పెషలిస్ట్ సేవలు, శస్త్ర చికిత్సలు విజయ వంతంగా జరుగుతున్నాయని, జిల్లా ఆసుపత్రిలో దంత వైద్య సేవలు ప్రజలకు చెరువులో ఉన్నాయని, అవసరమైన ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.