calender_icon.png 1 February, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్జరీ విజయవంతం చేసిన వైద్య బృందానికి అభినందనలు

01-02-2025 08:01:46 PM

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష...

పెద్దపల్లి (విజయక్రాంతి): క్లిష్టమైన సర్జరీని పెద్దపల్లి జిల్లా మాతాశిశు ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య బృందానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. 31 సంవత్సరాల వయస్సు గల మహిళా 6 వారాల 2 రోజుల గర్భం ఫల్లోపియన్ ట్యూబ్ లో ఏర్పడి, అది పగిలి తీవ్రమైన రక్తస్రావం కడుపులో జరుగగా, సదరు పేషెంట్ శనివారం ప్రైవేటు హాస్పిటల్ సంప్రదించగా స్కానింగ్ చేసి, హయ్యర్ సెంటర్ కు పంపించారు. ఆ మహిళ ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించిన వెంటనే, గవర్నమెంట్ హాస్పిటల్ లో డ్యూటీలో వైద్యాధికారి డా.లావణ్య, మత్తు స్పెషలిస్ట్ డాక్టర్.శౌరయ్య, ఆర్.ఎం.ఓ డా.రవీందర్, సూపరింటెండెంట్ డా.శ్రీధర్ తో పాటు సీనియర్ వైద్యుల సమక్షంలో గంట వ్యవదిలో అవసరమైన రక్త పరీక్షలు నిర్వహించి, కడుపు లోపల కల్లెక్ట్ ఐన సుమారుగా ఒక లీటర్ రక్తాన్ని తీసేసి బ్లీడింగ్ పాయింట్ ని కంట్రోల్ చేసి ఆపరేషన్ విజయవంతగా చేశారు. ఈ సర్జరీ వల్ల మహిళా ప్రాణం కాపడగలిగారు. ఈ శస్త్ర చికిత్సను విజయవంతగా నిర్వహించిన డాక్టర్ల బృందాన్ని, ఆసుపత్రి సిబ్బందిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ఆసుపత్రిలో మాతాశిశు ఆసుపత్రిలో వివిధ రకాల స్పెషలిస్ట్ సేవలు, శస్త్ర చికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయని, అవసరమైన ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.