calender_icon.png 7 February, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిక్ బాక్సింగ్ క్రీడాకారునికి అభినందన

07-02-2025 05:38:04 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ క్రీడాకారుడు రాసకొండ సంజీవ్ ఈనెల ఒకటి నుండి 5 వరకు న్యూఢిల్లీలోని కేడి జాదవ్ ఇండోర్ స్టేడియం ఐజి కాంప్లెక్స్ లో జరిగిన కిక్ బాక్సింగ్ రిఫరీ సెమినార్ లో పాల్గొని అత్యంత ప్రతిభ చూపారు. ఈ సెమినార్ లో సర్టిఫికెట్, అవార్డును దక్కించుకున్నారు. అందుకుగాను సంజీవ్ ను వాకో ఇండియా కిక్ బాక్సింగ్ అధ్యక్షులు సంతోష్ అగర్వాల్, వాక్కు ఇండియా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సంజీవ్, తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి మహిపాల్ లు ప్రత్యేకంగా అభినందించారు.