calender_icon.png 21 April, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి ప్రధాత ‘వేం’కు అభినందనలు వెల్లువ

21-04-2025 12:56:34 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 20 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తూ అభివృద్ధి ప్రదాతగా నిలుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్య సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి ని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి తదితరులు అభినందనలతో ముంచెత్తారు.

కేసముద్రం పట్టణంలో కొత్తగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 1.50 కోట్లు, ముస్లిం షాది ఖానా నిర్మాణానికి 80 లక్షలు, స్మశాన వాటిక కోసం 90 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను ఆదివారం ఎమ్మెల్యే మురళి నాయక్ చేతుల మీదుగా సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి అందజేశారు.

అనతి కాలంలోనే కేసముద్రం మండలాన్ని ఊహించని విధంగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తూ సొంత మండలంపై మమకారాన్ని చాటుకుంటున్న వేం నరేందర్ రెడ్డి కి మిఠాయిలు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యుడు గుగులోతు దస్రు నాయక్, డివైసిసి అధ్యక్షుడు సురేష్, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, ట్రాన్స్పోర్ట్ కమిటీ డిస్టిక్ అథారిటీ మెంబర్ రావుల మురళి, నాయకులు బండారు దయాకర్ తదితరులున్నారు.