calender_icon.png 3 February, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన గొండిగ త్రిషకు అభినందనలు

02-02-2025 10:49:20 PM

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఈరోజు మలేషియాలో జరిగిన అండర్-19 మహిళల ప్రపంచ కప్ ఫైనల్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వాసి గొండిగ త్రిషకు జిల్లా ప్రజలందరి తరఫున జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందనలు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా పేరును ప్రపంచ వేదికలో నిలబెట్టి, ఈరోజు చివరి మ్యాచ్లో అద్భుతంగా రాణించి బౌలింగ్, బ్యాటింగ్ లో ఉత్తమ ప్రదర్శన ద్వారా ఇండియా టీం అండర్ 19 ప్రపంచ కప్ సాధించడానికి ముఖ్య కారణమై, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచినందుకు గుండిగ త్రిషకు జిల్లా ప్రజలందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు. జిల్లా ప్రజలందరి తరఫున త్వరలోనే ఆమెను ఘనంగా సత్కరించినున్నట్లు కలెక్టర్ తెలిపారు.