25-03-2025 12:51:17 AM
బిగ్ వింగ్ షోరూమ్ ఓపెనింగ్
రాజేంద్రనగర్, మార్చి 24 (విజయ క్రాంతి): అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 71 వద్ద సోమవారం ఫార్చ్యూన్ హోండా బిగ్ వింగ్ స్పోరస్ట్ బైక్స్ షోరూమ్ కమ్ సర్వీసింగ్ సెంటర్ ను ఘనంగా ప్రారం భించారు. హోండా కంపెనీ డీలర్ డెవలప్‌మెంట్ మేనేజర్ మోహిత్ దిమాన్,మేనేజర్ దేవర్గా దత్తా ఎగ్జిక్యూటివ్ రాజేత్ మహాజన్, లు బిగ్ వింగ్ షోరూమ్, సర్వీసింగ్ సెంటర్ ను ప్రారంభించారు.
ఈసందర్బంగా పలువురు కస్టమర్లకు స్పోరస్ట్ బైక్ లను డెలివరీ చేశారు. అనంతరం ఫార్య్చూన్ హోండా డైరెక్టర్లు నీరవ్ మోదీ, అశీశ్ మోదీ, సీఈవో పీటర్ పాల్ సీయఫ్‌ఓ రవి ప్రకాష్ మాట్లాడుతూ.. తమ స్పోరట్స్ బైక్ ల విశిష్టతలు, షోరూమ్, సర్వీసింగ్ సెంటర్ విశేషాల గురించి వివరించారు.
తమ షోరూమ్ లో వివిధ రకాల మోడల్స్, కలర్స్ లో 350 సీసీ నుంచి 1500 సీసీ వరకు స్పోరట్స్ బైక్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. దశాబ్దాల కాలం నుంచి తాము అందిస్తున్న వాహన సేవలతో సంతృప్తిగా ఉన్న తమ విలువైన కస్టమర్లకు మరిన్ని సేవలు అందించేందుకు సిటీతో పాటు రాష్ట్రంలో పలుచోట్ల హోండా షోరూమ్, సర్వీసింగ్ సెంటర్ లను ప్రారంభించనున్నట్లు వివరించారు. వాహన కస్టమర్లతో తమది 24 ఏండ్ల విడదీయరాని బంధం అని తెలిపారు.
హైదరాబాద్ సిటీలో ఇది మూడవ బిగ్ వింగ్ షోరూమ్ ప్రస్తుతం అత్తాపూర్ లో ప్రారంభించినట్లు తెలిపారు. సమావేశంలో పార్య్చూన్ హోండా హెచ్‌ఆర్ హెడ్ అనురాధ మథూర్, సేల్స్ మేనేజర్ మోహిజ్, సర్వీస్ మేనేజర్ జగదీష్, పీఆర్‌వో నరేష్ పాల్గొన్నారు.