calender_icon.png 25 April, 2025 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ రాజర్షిషాకు అభినందనల వెల్లువ

25-04-2025 12:00:00 AM

ఆదిలాబాద్, ఏప్రిల్ 24 (విజయ క్రాం తి): ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారాన్ని అందుకున్న కలెక్టర్ రాజర్షి షాని జిల్లా అధికారులు ఘనంగా సన్మానించారు. ఇటీవలే జిల్లా అడ్మినిస్ట్రేషన్ విభాగంలో నార్నూర్ బ్లాక్ అస్పరెషనల్ ప్రోగ్రాం 2024 కు గాను జిల్లా కలెక్టర్ ఈ అవార్డుకు ఎంపికై ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ డే సందర్భంగాఅవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది గురువారం జిల్లా కలెక్టర్ ను శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అం దజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివి ధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.