calender_icon.png 8 January, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ఉద్యమాలను బలపరిచిన వారందరికీ అభినందనలు

06-01-2025 07:33:02 PM

సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు...

ఇల్లెందు (విజయక్రాంతి): సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3వ మహాసభల సందర్భంగా పార్టీ మహాసభల జయప్రదంకు కృషి చేసిన మహాసభ వాలంటీర్లకు, పార్టీ కార్యకర్తలకు, ఇల్లందు ప్రజానీకంకు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు సిపిఎం పార్టీ తరపున విప్లవ జైజైలు పలుకుతూ, అభినందనలు తెలియజేస్తున్నామని సిపిఎం రాష్ట్ర నాయకులు పి. సోమయ్య, సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యమాల అడ్డా ఇల్లందు గడ్డ లు సిపిఎం జిల్లా మహాసభలు డిసెంబర్ 20, 21 తేదీల్లో అత్యంత ఘనంగా విజయవంతంగా జరుపుకోవడం జరిగిందని ఈ మహాసభల జయప్రదంలో చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు నడుం బిగించి కృషి చేసారని అన్నారు.

ఏ ఉత్సాహంతో మహాసభల విజయవంతంకు భాగస్వాములు అయ్యారో అదే ఉత్సాహంతో పార్టీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహాసభలో తీసుకున్న నిర్ణయాల అమలుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలనీ అన్నారు. ముఖ్యంగా దేశంలో ప్రమాదకరంగా ఉన్న బీజేపీ మతోన్మాదంపై ఉక్కు పాదం మోపి పోరాటాల ద్వారా దేశ ప్రజానీకానికి కాపాడుకోవాలని అన్నారు. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించకుండా మత ఉన్మాదం వైపు బీజేపీ ప్రభుత్వం తీసుకపోతుందని ప్రభుత్వ రంగాన్ని ఆదాని, అంబానీలకు ధరదత్తం చేస్తున్నారని ప్రభుత్వ రంగాన్ని రక్షించుకునే భాద్యత దేశ ప్రజలపై ఉన్నదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తూట్లు పొడుస్తున్నారని అన్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అదే విధంగా జనవరి 25 నుండి 26 వరకు జరిగే తెలంగాణ రాష్ట్ర మహాసభల జయప్రదంకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అన్నారు. జిల్లా మహాసభల జయప్రదంలో వాలంటీర్ల పాత్ర ప్రధానంగా ఉందని వారందరికీ రెడ్ సెల్యూట్ తెలియచేస్తున్నాం అని అన్నారు. ఈ అభినందన సభలో సిపిఎం రాష్ట్ర నాయకులు అన్నవరపు కనకయ్య, ఏజె రమేష్, జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి, మాచర్ల గోపాల్, పగడాల నాగేశ్వరావు మండల కార్యదర్శి ఆలేటి కిరణ్, తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్ రావు, సుల్తానా, ఖాదర్, మాదారపు వెంకటేశ్వర్లు, సంధ్య, సర్వన్, కోడెం బోస్ తదితరులు పాల్గొన్నారు.