నిర్మల్ (విజయక్రాంతి): కడెం మండలంలోని అల్లంపల్లిలో గల చిన్న జీయర్ స్వామి వేదం పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు జాతీయస్థాయిలో అర్చలీలో ప్రతిభ సాధించడం అభినందనియమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం జాతీయస్థాయిలో ప్రతిభ సాధించిన శశివర్ధన్ ను కలెక్టర్ అభినందించారు. భవిష్యత్తులో జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, ప్రిన్సిపల్ శాంతారాం, పిటి బుక్కే రమేష్, కోచ్ జూగాది రావు, తదితరులు పాల్గొన్నారు.