calender_icon.png 1 February, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెలికాం సభ్యుడుగా ఎన్నికవ్వడంతో అభినందనలు..

01-02-2025 07:15:05 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడుగా జిల్లా కేంద్రానికి చెందిన విశాల్ ఖండ్రే ఎన్నికవ్వడంతో శనివారం ఆయనను బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ తో పాటు సీనియర్ నాయకులు అరిగెల నాగేశ్వరరావు, కొట్నాక విజయ్, బోనగిరి సతీష్ బాబు పలువురు నాయకులు సన్మానించారు. సందర్భంగా విశాల్ మాట్లాడుతూ... ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడెం నగేష్ చొరువ తో నాకు ఈ అవకాశం లభించిందన్నారు. పార్టీనీ నమ్ముకున్న ప్రతి ఒక్కరికి అవకాశాలు లభిస్తాయని అందుకు నేనే నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్రీశైలం, కృష్ణకుమారి, సోల్లు లక్ష్మి, సుచిత్, శ్రావణ్ గౌడ్, సంజీవ్, గణేష్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.