calender_icon.png 8 February, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టేకులపల్లి సంత వద్ద రద్దీ.. నిలిచినా రాకపోకలు..

08-02-2025 07:11:32 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండల కేంద్రంలో ప్రతీ శనివారం నిర్వహించే పశువుల సంత ఈ శనివారం విపరీతమైన రద్దీగా మారింది. సంత స్థలం కోదండ రామాలయం పక్కన ఉన్న నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయక పోవడంతో వ్యాపారాలు ఇల్లందు - కొత్తగూడెం ప్రధాన రహదారికి ఆనుకొని దుకాణాలు పెట్టడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఈ వారం సంతలో సరుకులు కొనుక్కునేందుకు పెద్ద సంఖ్యలో రావడంతో రహదారిలో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. సంత నిర్వాహకులు రహదారికి దూరంగా దుకాణాలను ఏర్పాటు చేస్తే ఇబ్బందులు ఉండవని తెలిసిన ఆలా చేయక పోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనాలు బారులు తీరి నిలిచి పోయాయి. వాహనాల రద్దేతో ఏదైనా ప్రమాదం జరిగితే కారకులు ఎవరు అవుతారన్న ప్రశ్న మొదలైంది. శనివారం సంతపై పోలీసులు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.