calender_icon.png 19 November, 2024 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగిళ్లలో జంట హత్యల కలకలం

19-11-2024 12:37:31 AM

రంగారెడ్డి, నవంబర్18 (విజయక్రాంతి): మాడ్గుల మండలం నాగిళ్లలో జంట హత్యల కలకలం రేగింది. హత్యకు గురైన ఇద్దరు వరుసకు బావ, బామ్మర్దులు కావడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బర్కం యాదయ్య(58) పదేళ్ల కింద భార్యను హత్య చేసి జైళ్లుకు వెళ్లగా, రెండేళ్ల క్రితం విడుదలై స్వగ్రామం ఒంటరిగా ఉంటున్నాడు.

యాచారం మండలం మేడిపల్లికి చెందిన గడ్డం శ్రీను(40) ఆదివారం రాత్రి నాగిళ్లలో ఓ వేడుకలో పాల్గొనేందుకు వచ్చాడు. బావ మాట్లాడించి వద్దామని శ్రీను.. బర్కం యాదయ్య ఇంటికి వెళ్లాడు. మాట్లాడుతున్న క్రమంలో ఏదో విషయమై ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వాగ్వాదం చోటు చేసుకొంది.

దీంతో పదునైన ఆయుధంతో ఇరువురు దాడి చేసుకోవడంతో తీవ్ర రక్తస్రావానికి ఇద్దరూ అక్కడిక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మాజీ సర్పంచ్ రమేశ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు మృతదేహాలను స్వాధీనం చేసుకోని పోస్టుమార్టం కోసం కల్వకుర్తి దవాఖానకు తరలించారు. ఏసీపీ రాజు నాగిళ్లలో పర్యటించి హత్యకు గల కారణాల గురించి ఆరా తీశారు.