calender_icon.png 31 October, 2024 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బదిలీలు, పదోన్నతుల్లో అయోమయం

06-07-2024 12:00:00 AM

  1. చనిపోయిన టీచర్‌కు ప్రమోషన్!
  2. అమలు కాని స్పౌజ్ పాయింట్ల నిబంధనలు
  3. ఆందోళనలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు 

రంగారెడ్డి, జూల్ 5(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల జాబితా లోపభూయిష్టంగా ఉన్నదని  పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. జిల్లా విద్యాధికారుల ఇష్టాను సారంగా విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో బదిలీలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. భాషా పండితుల పదోన్నతుల విషయంలో చనిపోయిన ఉపాధ్యాయుడికి పదోన్నతి కల్పిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేయడం పట్ల విమర్శలొస్తున్నాయి.

మంచాల మండలం తిప్పాయిగూడ గ్రామానికి చెందిన బషీర్ అనే ఉపాధ్యాయుడు 2023 జున్‌లో మృతిచెందాడు. విద్యాశాఖ అధికారులు మాత్రం ఆ ఉపాధ్యాయుడికి పదోన్నతి కల్పిస్తూ కోందుర్గు మండలంలోని యూపీఏస్  చిన్న ఎల్కచెర్లకు కేటాయి స్తూ  ఈ నెల 4న రాత్రి ఉత్తర్వులు జారీచేయడం విడ్డూరంగా ఉంది. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకుపోవడంతో ఈ నెల 5న ఆర్డర్‌లో మార్పులు చేశారు. 

బదిలీల్లో సర్వీస్ పాయింట్లు, స్పౌజ్ పా యింట్ల లెక్కింపులో కూడా విద్యాశాఖ అధికారులు నిబంధనలు పాటించడంలేదని, వా రి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని పలువురు ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. బదిలీలు, పదోన్నతుల విషయంలో జ రుగుతున్న లోపాలను  యూటీఎఫ్ సం ఘం నాయకులు కలెక్టర్ శశాంక, డీఈవో సుశీందర్‌రావు దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

లోపభూయిష్టంగా బదిలీలు

భాషాపండితుల పదోన్నతులు, బదిలీలు లోపభూయిష్టంగా జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు ఏస్‌ఏ బయోసైన్స్, సోషల్ పోస్టులో ఆర్డర్లు ఎన్ని పూర్తయ్యాయో వెల్లడించడంలేదు. ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్, ఎల్‌పీటీ, ఎల్‌పీహెచ్ మొత్తం జిల్లాలో ఖాళీల జాబితాను ప్రదర్శించలేదు. పదోన్నతులు ఎంతమందికి ఇచ్చారో కూడా విద్యాశాఖ అధికారులు వివరాలను వెల్లడించడంలేదు. జిల్లాలో ఎస్‌ఏ కింద 800 అప్‌గ్రేడ్ పోస్టులు అయినట్లు మాత్రం అనధికారికంగా తెలుస్తున్నది. జిల్లాలో మొత్తం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1,45ం వరకు ఉంటే ఇప్పటివరకు 1,000 మంది ఉపాధ్యాయులు బదిలీ అయినట్లు సమాచారం. 

నిబంధనల ప్రకారమే బదిలీలు: డీఈవో

ఈ విషయం గురించి జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావును వివరణ కోరగా.. నిబంధనల ప్రకారమే బదిలీలు, పదోన్నతులు చేస్తున్నామని చెప్పారు. బషీర్ అనే ఉపాధ్యాయుడి బదిలీ ఉత్తర్వు విషయం ఓవర్ లుక్‌లో మాత్రమే జరిగిందని వెంటనే సవరణ చేసి జాబితాను రూపొందించినట్లు చెప్పారు. బదిలీలు, పదోన్నతుల విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి ఉపాధ్యాయులు తీసుకురావాలని కోరారు.