బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని మునిసిపల్ పరిధిలో గల ఒకటవ వార్డులో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన వార్డు సభలో గందరగోళం చెలరేగింది. మొదటి విడత రేషన్ కార్డుల జాబితాలో, ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తమ పేర్లు లేవని కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకుని లబ్ధిదారులు సభకు హాజరైన ఆర్డీవోతో వాదనకు దిగారు. నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఏళ్లుగా ఎదురుచూసిన తమకు నిరాశ మిగిలిందని వారు అసహనం వ్యక్తం చేశారు. అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను అధికారులు మంజూరు చేసేలా చూడాలని వారు గ్రామసభలో కోరారు.