calender_icon.png 23 February, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్షలో గందరగోళం

23-02-2025 11:27:12 AM

సెంటర్ల కోసం పాట్లు

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలలో ప్రవేశాల కోసం ఏర్పాటుచేసిన ఉమ్మడి పరీక్ష కేంద్రాల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు పాటలు పడ్డారు. ఆదివారం ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్షల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో కేంద్రాలను కేటాయించారు. సరియైన రూట్ మ్యాప్ ఇవ్వకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు చిన్నపిల్లలను పట్టుకొని పరీక్ష కేంద్రాల కోసం చెక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు ముందుగానే పరీక్ష రాసే విద్యార్థులకు సంబంధిత సెంటర్ల నిర్వాహకులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాల కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.