calender_icon.png 30 October, 2024 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖానాపూర్ ఆసుపత్రిలో కలకలం

10-08-2024 05:04:28 AM

  1. రోగికి కాలం చెల్లిన స్లున్.. 
  2. అధికారులకు ఫిర్యాదు చేసిన బంధువులు

నిర్మల్, ఆగస్టు 9 (విజయక్రాంతి): ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కాలం చెల్లిన స్లున్‌ను రోగికి పెట్టిన ఘటన శుక్రవారం కలకలం సృష్టించింది. రోగి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం మం డల కేంద్రానికి చెందిన అజారుద్దీన్‌కు 3రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో  శుక్రవారం ఉదయం ఖానాపూర్‌లోని ప్రభు త్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైరల్ ఫీవర్‌గా గుర్తించిన వైద్యులు.. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని సూచించారు. అడ్మిట్ చేసుకొని బెడ్ కెటాయించి చికిత్స ప్రారంభించారు. విధుల్లో ఉన్న నర్సు మరొక సహాయకునితో కలిసి అజారుద్దీన్‌కు నియోమాన్ ఇంజక్షన్‌తో కూడిన స్లున్ బాటిల్‌ను చేతికి పెట్టింది.

సైలన్ బాటిల్ సరి గ్గా నడువకపోవడంతో బంధువైన సలీం బాటిల్‌ను పరిశీలించారు. ఆ బాటిల్‌పై కాలపరిమితి తేది మార్చి 2024 వరకు మాత్ర మే ఉంది. గడువు ముగిసి నాలుగు నెలలు దాటినా సిబ్బంది గమనించకపోవడంతో అజారుద్దీన్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆసుపత్రి ఉన్నతాధికారుల కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. తేరుకున్న సిబ్బంది కాలం చెల్లిన స్లున్ బాటిల్‌ను తొలగించి, రోగికి అన్ని రకాల ఆరోగ్య పరీక్ష లు చేశారు. అజారుద్దీన్ ఆరోగ్యంగా ఉన్నాడని, శరీరంలోకి 30 మి.మీ. మాత్రమే వెళ్లిం దని గుర్తించారు. ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యసిబ్బంది తెలిపారు. ఆ విషయం తెలుసుకున్న జిల్లా పర్యవేక్షకుడు సురేష్‌కుమార్ సిబ్బందితోపాటు అజారుద్దీన్‌తో మాట్లాడారు. సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.