calender_icon.png 21 April, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవుడా.. వీరి ఆలనా పాలనా ఎలా?

21-04-2025 01:13:52 AM

రెండేళ్ల కిందట తల్లి.. ఇప్పుడు తండ్రి మృతి

అయోమయంలో పిల్లలు 

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్20 (విజయ క్రాంతి): అనారోగ్య కారణాలతో రెండేళ్ల కిందట తల్లి మృతిచెందగా ఇద్దరు చిన్నారులను తండ్రి అల్లారుముద్దుగా చూసుకుంటున్న క్రమంలో.  విధి పిల్లల కు శాపంగా మారి తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు.. తల్లి కోల్పోయి దీనస్థితిలో ఉన్న వారి అలనా పాలన చూస్తున్న ఒక్క దిక్కు కోల్పోయి ఆ ఇద్దరు అనాథలుగా మిగిలారు. ఈ విషాద ఘటన  జిల్లాలోని సిర్పూ ర్(యు) మండలంలో చోటుచేసుకుంది.