calender_icon.png 23 October, 2024 | 3:02 PM

అయోమయంలో అంగన్వాడీలు

10-07-2024 05:48:13 AM

  • 65 ఏండ్లు దాటిన ఉద్యోగుల తొలగింపుపై ఆందోళన
  • స్పష్టత లేని తొలగింపులపై నిరసన జ్వాలలు

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 9(విజయక్రాంతి): పిల్లల సంరక్షణతో పాటు గర్భిణులు, బాలింతల కోసం నిరంతరం కృషి చేసే అంగన్వాడీలు, ఆయాలు ప్రభుత్వ నిర్ణయంతో అయోమయానికి గురవుతున్నారు. 65 ఏండ్లు నిండిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలను తొలగిస్తూ సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తమను ప్రభుత్వం రోడ్డుపై పడేస్తోందని టీచర్లు, హెల్పర్లు అవేదన వ్యక్తం చేస్తున్నారు. విధులకు రావొద్దన్న అధికారులు పెన్షన్, ఇతర సౌకర్యాలపై స్పష్టత ఇవ్వడం లేదు.

దీంతో అంగన్వాడీలు పోరుబాట పట్టారు. జిల్లాలో ఆసిఫాబాద్, జైనూర్, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), వాంకిడి ప్రాజెక్టుల పరిధిలో 973 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 886 మంది టీచర్లు, 713 మంది హెల్పర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. 65 ఏండ్లు నిండిన వారిలో టీచర్లు 35 మంది, ఆయాలు 131 మంది ఉన్నారు. ఈ నెల 1 నుంచి వీరిని విధుల్లోంచి తొలగించారు. ఎలాంటి బెనిఫిట్స్ వర్తిస్తాయో అధికారులు చెప్పకపోవడంతో అందోళన బాట పట్టారు. 

టీచర్‌కు రూ.లక్ష, ఆయాకు రూ.50 వేలు

అంగన్వాడీ టీచర్‌కు రూ.13,650, హెల్పర్‌కు రూ.7,800 వేతనాన్ని ప్రభుత్వం చెల్లి స్తున్నది. గతంలో అంగన్వాడీ టీచర్‌కు 65 ఏండ్ల పైబడి ఉంటే వన్‌టైం సెటిల్‌మెంట్ బరిటైర్మెంట్ బెనిఫిట్ రూ.లక్ష, ఆయాకు రూ.50 వేలు అందజేసేవారు. గత అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు అంగన్‌వాడీ టీచర్లకు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద రూ.2 లక్షలు, ఆయాకు రూ.లక్ష చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నెల టీచర్‌కు రూ.18 వేలు, ఆయాకు రూ.13 వేల వేతనం అందిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఈ విష యంపై స్పష్టత లేక, ఉన్నవారిని విధుల్లోకి తీసుకోకతమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పోరుబాట పట్టిన అంగన్వాడీలు

తమ సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 6 నుంచి సీఐటీయూ అనుబంధ సంస్థ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్ప ర్స్ అధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఇన్నాళ్లు తమను శ్రమదోపిడీ చేసి, మానవత్వం లేకుండా విధులను తొలగించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్కారు చిన్నచూపు

అంగన్వాడీలపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నది. 65 ఏండ్లు నిండిన వారిని అమానుషం గా తొలగించడం అన్యాయం. ఎలాంటి ఆర్థిక భద్రత కల్పించకుండానే విధులకు రావొద్దని అధికారు లు అదేశించారు. దాదాపు 40 ఏళ్లుగా పని చేస్తున్న వారికి ఎలాం టి బెనిఫిట్స్ ఇవ్వకుండా తొలగించడం తగదు. 

 మాడవి గంగామణి, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు భద్రత లేని ఉద్యోగం

ఉద్యోగాల తొలగింపులో ప్రభుత్వం ఆర్థిక భద్రత కల్పించకపోవడం దారు ణం. 65 ఏళ్లు నిండిన వారు విధుల్లోకి రావొద్దన్న సర్కారు వారికి ఎలాంటి బెనిఫిట్స్ వర్తింపజేస్తుందో స్పష్టత ఇవ్వలేదు. ఇంత కాలం చేసిన పనికి కనీసం ప్రభుత్వం గుర్తించ డం లేదని అందళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది. 

 వనిత, అంగన్వాడీటీచర్, ఆసిఫాబాద్