తెలంగాణ అధికారులను అడ్డుకున్న ఏపీ అధికారులు
హైదరాబాద్: నాగార్జునసాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారుల మధ్య వివాదం చోటుచేసుకుంది. తెలంగాణ అధికారుల కుడి కాల్వ వాటర్ రీడింగ్ నమోదుకు వెళ్లారు. దీంతో ఏపీ అధికారులు తెలంగాణ అధికారులను అడ్డుకున్నారు. దీంతో తెలంగాణకు సంబంధించిన అధికారులు కేఆర్ఎంబీ యాజమాన్యానికి సమాచారామిచ్చారు. సాగర్ ఎస్ఈ కృష్ణమోహన్ ఇరురాష్ట్రాల అధికారులకు సర్దిచెప్పారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం సద్దుమనిగింది.