ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషీ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (విజయక్రాంతి): గంజాయి విక్రేతల పట్ల రాష్ట్రప్రభుత్వం సీరియస్‌గా ఉందని, ఇక నుంచి గంజాయి విక్రయించే వారి ఆస్తులను సర్కార్ జప్తు చేస్తుందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషీ హెచ్చరించారు. ధూల్‌పేట్‌లోని రహీంపుర గౌడ మఠంలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
గంజాయి విక్రయాలు నిలిపి వేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే చాలా మంది గంజాయి అమ్మకాలను నిలిపేశారన్నారు. అనంతరం పలువురు గంజాయి విక్రయాలపై ఆధారపడే పేదలకు ప్రభుత్వం సాయం చేయాలని కోరారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌కుమార్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ భాస్కర్, సీఐలు మధుబాబు, గోపాల్, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, కోటమ్మ పాల్గొన్నారు.