calender_icon.png 28 November, 2024 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎఫ్టీఎల్, బఫర్‌జోన్లు నిర్ధారించండి

28-11-2024 02:03:36 AM

  1. డిసెంబర్ ౩౦లోగా నివేదిక ఇవ్వాలి
  2. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, నవంబర్ 27(విజయక్రాంతి) : హెచ్‌ఎండీఏ పరిధిలోని మొత్తం చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్స్ (ఎఫ్టీఎల్) తేల్చాలని, ఈ మేరకు తుది నోటిఫికేషన్ వెలుడేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యల నివేదికను డిసెంబరు 30న జరిగే విచారణ నాటికి అందజేయాలని స్పష్టంచేసింది.

రామమ్మకుంటలో ఎఫ్టీఎల్ పరిధిలో నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టూరి జం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కట్టడా లు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. ఈ ఏడాది జులై 24న వ్యక్తిగతంగా హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ ఖాన్ హైకోర్టుకు తెలిపిన వివారాల ప్రకారం హెచ్‌ఎండీఏలో 3,532 చెరువులు ఉన్నాయని, 230 చెరువులకు ఎఫ్టీఎల్ కోసం తుది నోటిఫికేషన్ ఇచ్చా మని చెప్పారు.

అనంతరం ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ హెచ్‌ఎండీఏ పరిధిలో ఇప్పు డు 2,793  చెరువులు ఉన్నాయని, వాటిలో 530 చెరువులకు తుది నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. అప్పటికి, ఇప్పటికీ చెరువుల సంఖ్య పెరగడంపై హైకోర్టు ఆరా తీసింది.

ఇప్పుడు కూడా తుది నోటిఫికేషన్‌కు మళ్లీ 3 నెలల గడువు కావాలని కోరడాన్ని హైకోర్టు అంగీకరించలేదు. హెచ్‌ఎండీఏలోని అన్ని చెరువుల వ్యవహారంపై సుమోటోగా విచారణ చేస్తున్నట్టు ప్రకటించింది. వచ్చేనెల 30వ తేదీ నాటికి హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల గుర్తింపుపై రిపోర్టు ఇవ్వాలని హెచ్‌ఎండీఏను ఆదేశించింది.