13-03-2025 02:10:02 AM
ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి
హైదరాబాద్, మార్చి 12 (విజయ క్రాంతి): సీఎం ప్రజావాణిపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని రాష్ర్ట ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ చిన్నారెడ్డి తెలిపారు. ప్రజావాణికి వెళితే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న విశ్వాసం ప్రజల్లో కలుగుతోందని అభిప్రాయపడ్డారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరు ల కేంద్రంలో ‘సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్... ది రోల్ అఫ్ ప్రజావాణి అండ్ ప్రజా పాలన ఇన్ తెలంగాణ’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్ కు చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించే ప్రజావాణి ఇప్పటివరకు 110 వారా లు పూర్తి చేసుకుందని, ఇప్పటివరకు 92,072 దరఖాస్తు వచ్చాయని తెలిపారు. అందులో 35 వేల దరఖాస్తుల ను పరిష్కరించినట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, పాండురంగారెడ్డి, విష్ణు పాల్గొన్నారు.