భారత్‌లో ఒహరా స్కూల్ ఆఫ్ ఇకెబనాకు 35 ఏండ్లు
సోమాజిగూడ హోటల్ పార్క్‌లో ప్రత్యేక కార్యక్రమం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30 (విజయక్రాంతి): ప్రపంచ ప్రఖ్యాత జపాన్ కళ ఇకెబనపై నేడు హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం జరుగనున్నది. ఒహరా స్కూల్ ఆఫ్ ఇకెబన హైదరాబాద్‌లోకి ప్రవేశించి 35 ఏండ్లు పూర్తయిన సందర్భంగా సోమాజిగూడలోని ది పార్క్ హోటల్‌లో ఇకెబన ఆర్ట్‌పై ప్రత్యేక డెమాన్‌స్ట్రేషన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జపాన్ కాన్సుల్ జనరల్ తకహషి మునెయో ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ప్రఖ్యాత ఇకెబన ఆర్టిస్ట్, ఒహర స్కూల్ హెడ్ మాస్టర్ లెమోటో హిరోకి ఒహర ఈ కార్యక్రమంలో ఇకెబన ఆర్ట్ గురించి వివరిస్తారు. ఆగస్టు 1, 2 తేదీల్లో ఇకెబన ఆర్ట్‌పై వర్క్‌షాప్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇకెబన ఆర్ట్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షురాలు నిర్మల అగర్వాల్ అధ్యక్షతన జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. పూలు, పూల మొక్కలను అందంగా అలంకరించే కళనే జపాన్‌లో ఇకెబన అంటారు. ఆ దేశంలో ఈ కళకు విశేష ఆదరణ ఉన్నది.