calender_icon.png 15 January, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలల నిర్వహణపై సమావేశం

19-07-2024 01:16:00 AM

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి) : త్వరలో ప్రభుత్వ పాఠశా లల ప్రధానోపాధ్యాయులతో పాఠశాల విద్యాశాఖ  ఓ సమావేశం నిర్వ హించనుంది. పాఠశాలల నిర్వహణ, మధ్యాహ్న భోజనం అమలు, ఎన్‌రోల్‌మెంట్, విద్యాబోధన, మౌలిక వసతులు తదితర అంశాలపై వారం రోజుల్లో సమావేశం నిర్వహించనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం అమలు, నిర్వహణ తీరుపై మార్గదర్శకాలను కూడా జారీ చేస్తామని పేర్కొన్నారు.