calender_icon.png 23 March, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడిపల్లిలో భూగర్భ నీటి వినియోగంపై సదస్సు

22-03-2025 06:30:33 PM

కాటారం,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లి గ్రామంలోని ఆశ్రమ పాఠశాల ఆవరణలో భూగర్భ జల శాఖ సహకారంతో వెలుగు రేఖ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవం, నీటి వినియోగంపై సదస్సు నిర్వహించారు. గ్రౌండ్ వాటర్ రామకృష్ణ, వాసు, సింగరేణి రాంకుమార్, డీఆర్డీఎ కిరణ్, డిబిఎస్ బ్యాంకు మేనేజర్ హరీష్, సీఈవో రజిత, రిసోర్స్ పర్సన్ లక్ష్మీరాజం, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మంచినీటి వినియోగం, అభివృద్ధి, నిర్వహణ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వాన నీటిని భూమిలోకి ఇంకించి, భూగర్భ జల మట్టాన్ని పెంచుటకు చేపట్టవలసిన పనుల గురించి వివరంగా తెలియజేశారు. పలు సూచనలు చేశారు. ఇంకుడు గుంతలను  ప్రతి ఇంటిలో ఏర్పాటు చేయుట తప్పనిసరి అని తెలిపారు. చేనులో ఫారం ఫండ్ నిర్మించుట, కాలువలకు అడ్డ కట్టలు వేయుట , అటకటాలు వేయటం వంటి నిర్మాణం మార్పులు చేయాలని తెలిపారు.