calender_icon.png 23 February, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్లడ్ క్యాన్సర్స్‌పై యశోదలో సదస్సు

23-02-2025 12:00:00 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాం తి): హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్‌లో శనివారం 200 మందికిపైగా జాతీయ, 10 మందికిపైగా అంతర్జాతీయ ఆంకాలజీ, హెమటో-ఆంకాలజీ వైద్య నిపుణులతో బ్లడ్ క్యాన్సర్స్ పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. డెక్కన్ హెమటోలింక్ 2.0 బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స, రోగి కేర్‌లో వచ్చిన తాజా పురోగతులపై చర్చించారు.

రెండు రోజుల సదస్సులో భాగంగా మొదటి రోజు ముఖ్య అతిథిగా యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. జి.యస్ రావు సదస్సును ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఏటా దాదాపు 1.3 మిలియన్ల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయన్నారు. క్యాన్సర్ చికిత్సలో ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన విప్లవాత్మక మార్పులు క్యాన్సర్ రోగులకు కొత్త ఆశలను అందిస్తున్నాయని తెలిపారు.

యశోద హాస్పిటల్స్ -హైటెక్ సిటీ సీనియర్ హెమటాలజిస్ట్ డాక్టర్ గణేష్ జైషేత్వర్ మాట్లాడుతూ.. యశోద హాస్పిటల్స్ గత 12 సంవత్సరాలుగా 500కి పైగా విజయవంతమైన ఎముక మజ్జ మార్పిడిని, వేలాది మంది రక్త క్యాన్సర్ రోగులకు చికిత్సను అందించిందన్నారు. యశోద హాస్పిటల్, హైటెక్ సిటీలో అవసరమైన ప్రతి బ్లడ్ క్యాన్సర్ రోగికి ప్రపంచ స్థాయి చికిత్సను అందించనున్నట్టు తెలిపారు. వివరాలకు 7893053355/8897196669 నంబర్లలో సంప్రదించాలన్నారు.