మెదక్, జనవరి 19(విజయక్రాంతి): కార్మిక కర్షక ఐక్య దినత్సవం సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అనే అంశంపై సదస్సును ఆదివారం స్థానిక కేవల్ కిషన్ భవన్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చింతల గౌరయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి బి బస్వరాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక, కర్షక ఐక్య దినోత్సవ సందర్భంగా సదస్సును నిర్వహించడం జరిగిందన్నారు.
కార్మిక కర్షక ఐక్య పోరాటంలో 1982 సంవత్సరంలో వ్యవసాయ కూలీలు తమ హక్కుల కోసం సమ్మె సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలో నాటి ప్రభుత్వం కాల్పులు జరిపారని, ఆ కాల్పుల్లో పది మంది వ్యవసాయ కూలీలు చనిపోవడంతో దేశవ్యాప్తంగా వ్యవసాయ కూలీల హక్కుల కోసం, రైతుల కోసం కార్మికుల కోసం దేశ వ్యాప్త ఉద్యమాలు వెలివడ్డాయని తెలిపారు. కార్యక్ర మంలో సిఐటియు మెదక్ కన్వీనర్ సంతోష్, కమల, రాణి పాల్గొన్నారు.