calender_icon.png 7 November, 2024 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగుతున్న గవర్నర్ల సదస్సు

03-08-2024 10:56:43 AM

న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్రాల మధ్య సార్థక వారధులుగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోడీ గవర్నర్లను కోరారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన ప్రారంభమైన గవర్నర్ల సదస్సులో ప్రధాని మోడీ పాల్గొన్నారు. రాజ్యాంగం పరిధిలో ప్రజల సేవకు గవర్నర్ పదవి దోహదం చేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం వర్దిల్లాలంటే అన్ని రాష్ట్రాల్లో కేంద్ర సంస్థలు సమన్వయంతో పనిచేయడం అవసరం అన్నారు. ఆయా రాష్ట్రాల్లో సమన్వయంతో పాటు ఐక్యత భావం పెంపొందించేలా చూడాలని గవర్నర్లకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చేలా రూపొందించిన జాతీయ విద్యావిధానాన్ని సమర్థంగా అమలయ్యేందుకు యూనివర్సిటీల ఉపకులపతుల హోదాలో గవర్నర్లు కృషి చేయాలన్నారు. శనివారం కూడా గవర్నర్ల సదస్సు కొనసాగుతోంది. ఇందులో భాగంగా గవర్నర్లు సబ్ గ్రూపులుగా ఏర్పడి కేంద్రరాష్ట్రాల సంబంధాలు, ప్రజాసమస్యలు, సంక్షేమ కార్యక్రమాల వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు.