calender_icon.png 28 October, 2024 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ ఏఎస్ రావు విజ్ఞాన ఉత్సవంలో భాగంగా సదస్సు

28-10-2024 04:24:14 PM

కాప్రా (విజయక్రాంతి): తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్, డాక్టర్ ఏఎస్ రావు విజ్ఞాన వేదిక, విజ్ఞాన దర్శిని సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ ఏఎస్ రావు విజ్ఞాన ఉత్సవాలలో భాగంగా కుషాయిగూడ పారిశ్రామిక వాడలోని శ్రీ చైతన్య స్కూల్లో డాక్టర్ ఏఎస్ రావు బయోపిక్, సైంటిఫిక్ టెంపర్ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి ప్రతీనిధి గొడుగు యాదగిరి అధ్యక్షుతన నిర్వహించిన సదస్సులో విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు రమేష్ ప్రసంగంచారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ ఏ ఎస్ రావు గారు గొప్ప శాస్త్రవేత్త, దేశ స్వావలంబన కొరకు ఆయన జీవిత కాలం పని చేశారన్నారు. ఈసీఐఎల్, ఏ ఎస్ రావు నగర్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ ప్రభు మాట్లాడుతూ.. డాక్టర్ ఏఎస్ రావు అతి సామాన్య జీవితం గడిపారని, ఎన్నో మహోన్నత విలువలతో జీవించారన్నారు. దేశ స్వావలం కొరకు ఎంతో ఘనమైన ఉత్పత్తులు సాధించి పెట్టారాని, బాల్యంలో కడు పేదరికంలో జన్మించి కూడా తిండికి కష్టమైనప్పటికీ చదువు పట్ల ఇష్టంగా పట్టుదలతో చదివారన్నారు.

విదేశాలలో చదివినప్పటికీ భారతదేశానికి సేవ చేయాలనే దృక్పథంతోనే ఈసీఐఎల్ స్థాపించి అభివృద్ధికి కృషి చేశారని అయన తెలిపారు. అనంతరం డాక్టర్ ఏఎస్ రావు చిత్రాన్ని ప్రదర్శించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సిబ్బంది చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రం స్ఫూర్తి బాధ్యులు పి బి చారి, శ్రీమన్నారాయణ, జయరాజ్ లతో పాటు  ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.