calender_icon.png 1 March, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సైన్స్ డే నిర్వహణ

28-02-2025 09:07:49 PM

టేకులపల్లి (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని (సైన్స్ దినత్సవం) శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి పాఠశాలలు వేదికగా నిలిచింది. ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు సైన్స్ కు సంబంధించిన ప్రయోగాలను తయారు చేసి వాటి గురించి తోటి సహచర విద్యార్థులకు వివరించడం జరిగింది. అందులో ముఖ్యంగా చంద్రయాన్, వాల్కనో వాటర్ ప్యూరిఫికేషన్, విండ్ మిల్, ఎల్ఈడి టెలివిజన్ విద్యార్థులను బాగా ఆకర్షితులను చేశాయి. వీటిలో మరికొన్ని మైక్రోస్కోప్, సెన్స్ ఆర్గాన్స్, సోలార్ సిస్టం, ఎర్త్ వేక్ ప్రయోగాలు తయారుచేసి తోటి సహచర విద్యార్థులకు పరిచయం చేయడం జరిగింది.

స్థానిక గ్రావిటీ పాఠశాల కరస్పాండెంట్ బోడాపునియా నాయక్ మాట్లాడుతూ... ప్రయోగాలు తయారుచేసిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ భావితరాలకు ఉపయోగపడే విధంగా ఎదగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బొడ్డుపల్లి బ్రహ్మచారి, ఉపాధ్యాయులు గంగా స్వాతి, సంజు, భవాని, లలిత, సరస్వతి, సుశీల విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల టేకులపల్లిలో విద్యార్ధులు తయారు చేసిన సైన్స్ మోడల్ లు ప్రదర్శించారు. విద్యార్దులకు క్విజ్ పోటీలు, వ్యాస రచన పోటీలు, చిత్ర లేఖనం పోటీలు నిర్వహించారు. వీటిలో ఉత్తమ వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మెరుగు శ్రీనివాస్, సైన్స్ టీచర్స్ రంగారావు, పద్మావతి, పుష్పావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.