calender_icon.png 26 April, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతుల నిర్వహణ

26-04-2025 04:47:20 PM

ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియా సింగరేణి హై స్కూల్ నందు వేసవి సెలవుల్లో భాగంగా 7వ, 8వ, 9వ తరగతుల వారికీ ఇంటర్మీడియట్ విద్యార్దిని, విద్యార్థులకు పూర్తి ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించినట్లు ఏరియా జనరల్ మేనేజర్ వి కృష్ణయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇల్లందు సింగరేణి కాలరీస్ ఏడెడ్ ఉన్నత పాఠశాలలో ఈనెల 28వ తేదీ నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ప్రారంభిస్తున్నటు తెలిపారు. ఈ శిక్షణను స్థానిక విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు ఇల్లందు ఏరియా సింగరేణి పాఠశాల హెడ్మాస్టర్ ను సంప్రదించగలరని తెలిపారు.