09-04-2025 07:19:30 PM
ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలో 2025 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఉచితంగా పాలిసెట్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ వీసం కృష్ణయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఇల్లందు సింగరేణి కాలరీస్ ఏడెడ్ ఉన్నత పాఠశాలలో ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నటు తెలిపారు. ఈ శిక్షణను స్థానిక విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు ఇల్లందు ఏరియా సింగరేణి పాఠశాల హెడ్మాస్టర్ ను సంప్రదించగలరని తెలిపారు.