28-03-2025 12:00:00 AM
సూర్యాపేట, మార్చి 27: ప్రభుత్వం నుంచి 2025-26 విద్యా సంవత్సరానికి ఎటువంటి అనుమతులు లేకున్నా జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థ నారాయణ కాళాశాల పేరుతో బోర్డులు ఏర్పాటు చేసి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ అడ్మిషన్లు, తరగతులు నిర్వ హిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు పూల్లూరి సింహాద్రి డిమాండ్ చేశారు.
గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి డీఐఈఓ భాను నాయక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఎలాంటి అనుమతులు లేకుండా అడ్మిషన్ నిర్వహిస్తూ, అకామిడేషన్ చూపించకుండా ప్రకటన పత్రంలో ఫీజులు తెలియజేయకుండా తమ పిల్లలను వృద్ధిలోకి తీసుకురావాలనే తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని లక్ష నుంచి లక్షన్నర రుసుము అని, ముందుగానే డబ్బును కట్టి స్లాట్ బుక్ చేసుకోవాలని ప్రచారానికి దిగుతున్న నారాయణ కళాశాల పై పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారానికి తిరుగనీయకుండా ఆర్డర్ ఇవ్వాలని కోరారు.