calender_icon.png 24 February, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటింటి ప్రచారం

24-02-2025 05:40:04 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నిర్మల్ పట్టణంలో కాంగ్రెస్ బిజెపి స్వతంత్ర అభ్యర్థులు ఓటర్ జాబితాను ఆధారంగా చేసుకుని ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలిస్తే చేపట్టే కార్యక్రమాలను ఓటర్లకు వివరిస్తూ తమకు మద్దతు ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పట్టణ అధ్యక్షులు నాందేడ్ చిన్ను పార్టీ నాయకులు అయ్యగారు పోశెట్టి నల్లూరి పోశెట్టి, బిజెపి నాయకులు రాజు అరవింద్ సాయి తదితరులు ఉన్నారు.