calender_icon.png 13 January, 2025 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

20న పీటీఎం నిర్వహించండి

16-07-2024 12:15:00 AM

అధికారులకు విద్యాశాఖ ఆదేశాలు

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 20న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ‘తల్లిదండ్రుల భాగస్వామ్యం’ అనే అంశంపై ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఖచ్చితంగా విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యేలా డీఈవోలు, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకోవాలని సూచించింది. తల్లిదండ్రులకు ఆహ్వానం అందించాలని విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న వారి వివరాలు మండల, జిల్లాల అధికారులందరూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయానికి పంపాలని ఆదేశించారు.