అంత్యక్రియల్లో పాల్గొన్న చెన్నూరు బీఆర్ఎస్ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్...
మందమర్రి (విజయక్రాంతి): చెన్నూర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ 4వ వార్డు మాజీ కౌన్సిలర్ రేవెల్లి మహేష్ తాత రేవెల్లి పోషం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం అంత్యక్రియలలో పాల్గొని మృతుని పాడేను మోశారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపిపి మంత్రి బాపు, మాజి వైస్ ఎంపిపి బాపు రెడ్డి, మాజీ జడ్పీటీసీ మోతే తిరుపతి, సీనియర్ నాయకులు నాయిని సతీష్, జైపూర్ మండల నాయకులు బడుగు రవి, యూత్ నాయకులు నాయబ్, ప్రశాంత్, తిరుపతి, అవినాష్ లు పాల్గొన్నారు.