20-03-2025 12:00:00 AM
బాధిత కుటుంబాన్ని ఓదార్చిన బీఆర్‌ఎస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం, మార్చి 19 (విజయ క్రాంతి): మృతి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడి కుటుంబాన్ని పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి పరామర్శించారు. మంచాల మండలంలోని లోయపల్లి గ్రామ బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు పాలకూర్ల వెంకటేశ్ గౌడ్ తండ్రి జంగయ్య గౌడ్ ఇటీవల మరణించగా, వెంకటేష్‌ను పరామర్శించి, చిత్రపటానికి నివాళులర్పించిన బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి), మంచాల మండల అధ్యక్షులు చీరాల రమేశ్, ఇబ్రహీంపట్నం మాజీ మున్సిపాలిటీ చైర్మన్ కంబాలపల్లి భరత్ కుమార్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు జెర్కొని రాజు, మడుపు శివసాయి, కర్నె అరవింద్, కొండ్రు ప్రవీణ్, పాతురి రాజేష్, బొర్ర రమేష్ (టిల్లు) తదితరులు పాల్గొన్నారు.