calender_icon.png 9 April, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమనీయం..రాములోరి కల్యాణం

07-04-2025 12:27:10 AM

నల్లగొండ, ఏప్రిల్ 6 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే రామాలయాలు రామ నమస్మరణతో మారుమోగాయి. సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయాలకు తీసుకొచ్చి వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, భాజాభజంత్రీల నడుమ సీతారాముల కల్యాణాన్నికనుల పండువగా నిర్వహించారు. భక్తులు భారీగా హాజరై కల్యాణ ఘట్టాన్ని తిలకించి ఆది దంపతులకు ముత్యాల తలంభ్రాలు సమర్పించారు.  మండపాల వద్ద భక్తులకు ఆల య కమిటీ సభ్యులు అన్నదానం చేశారు. 

వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు..

నల్లగొండ రామగిరిలోని రామాలయం లో నిర్వహించిన కల్యాణానికి కలెక్టర్ దంప తులు ఇలా త్రిపాఠి, భవేష్మిశ్రా  హాజరై ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు  సమర్పిం చారు. కొండమల్లేపల్లిలో నిర్వహించిన స్వామివారి కల్యాణంలో దేవరకొండ ఎమ్మె ల్యే పాల్గొన్నారు. మునుగోడు మండలం కొంపల్లి, చీకటిమామిడి గ్రామాల్లో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి హాజరై కల్యాణాన్ని తిలకించారు.

నకిరేకల్ పట్టణం లోని అభయాంజనేయస్వామి ఆలయం, నకిరేకల్ మండలం నోముల, చిట్యాల మండలం తాళ్లవెల్లంల నిర్వహించిన వేడుకల్లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. మిర్యాలగూడ మండలం ఊట్లపల్లిలో జరిగిన ఉత్సవాల్లో మిర్యాల గూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొ న్నారు. స్థానిక మసీదులో ముస్లింలు ప్రసా దాలను తయారు చేసి అందించారు. 

యాదాద్రి భువనగిరిలో

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 6 ( విజయ క్రాంతి ): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అర్చకులు కనుల పండుగ నిర్వహించారు. భువనగిరి పట్టణంలో కిలా ఆంజనేయస్వామి ఆలయంలో, పచ్చల కట్ట సోమేశ్వర ఆలయంలో, హనుమాన్ వాడ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో, కన్యకా పరమేశ్వరి ఆలయంలో, మాస్కుంట ఆంజనేయస్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా భక్త జనుల మధ్య కనువిందుగా చూడముచ్చటగా జరిగింది.

స్వామి వారి కళ్యాణం లో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ నాయకులు తంగళ్ళపల్లి రవికుమార్, బర్రె జహంగీర్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు ఆలయాల చైర్మన్లు, డిడి కాడి నర్సింగరావు, టిఆర్‌ఎస్ నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి,  వ్యాపారస్తులు పాల్గొన్నారు.

రాజ్‌పూర్‌లో సీతారాముల కల్యాణం 

 భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామంలో ఆలయ చైర్మన్ డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్వామి వారి కల్యాణ మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. 

మఠంపలల్లిలో

మఠంపల్లి ఏప్రిల్ 06: సూర్య పేట జిల్లా మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా, కాల్వపల్లి తండా గ్రామంలోఅభయాం జనేయ దేవాలయం నందు పూజారులు ప్రసాద్, అప్పల్లయ్య చార్యుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం  నిర్వహించారు.

ఉత్సావా విగ్రహాలు దాతలు బానోతు భధ్య జ్ఞాపకార్థంగా కుమారులు బానోతు మాంజ్య, బానోతు రూప్ల,పల్లకి దాత శ్రీరాముల బ్రహ్మచారి వారి కుమారులు,దేవాలయం గేటు దాత బానోతు హేమ, భరత్, నాగరాజు, బాలరాజు, భాను ప్రసాద్ లు బహు కరించారు.

గ్రామ పెద్ద బానోతు చంద్రు నాయక్, దేవాలయం చైర్మన్ బానోతు నాగరాజు, మాజీ సర్పంచ్లు బానో తు బాల నాయక్,మాలోతు సక్రు నాయక్, మాజీ ఎంపీటీసీ వీణా నాయక్, నాగు నాయక్, భరత్ నాయక్, దేశ్ పాండు నాయక్, దేవాలయం మాజీ చైర్మన్ నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ రమేష్,సైదా,సోముడు, హనుము, భీముడు, రాజేష్ పాల్గొన్నారు.

మునగాలలో

మునగాల, మార్చి 06: సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రములో శ్రీ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను  ఘనంగా నిర్వహించారు. దేవాలయ అర్చకులు శ్రీనివాసచార్యులు. వారణాసి కిషోర్ కుమార్ చేతుల మీదుగా.భూమగళ్ల ప్రవీణ్ కుమార్- అమిత దంపతులు. శ్రీరామ్ కృష్ణ నిహార్-నాగ సంతోషి దంపతులు. పీటర్ మీద కూర్చొని శ్రీ సీతారామ చంద్రుల కళ్యాణం జరిపించారు.

భక్తులకు పానకం, వడపప్పు .1000 మజ్జిగ ప్యాకెట్లు  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శెట్టి గిరి సరస్వతి దంపతులు అందజేశారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గోని సీతారాముల కళ్యాణ అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాని తోగంటి వేలాద్రి హైమావతి. దంపతులు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి. మాజీ జడ్పిటిసి నల్లపాటి ప్రమీల శ్రీనివాసరావు మునగాల సొసైటీ  చైర్మన్ కందిబండ సత్యనారాయణ.బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బుచ్చి పాపయ్య. ఉప్పుల జానకి రెడ్డి దేవాలయ కమిటీ సభ్యులు  గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

తుంగతుర్తిలో 

తుంగతుర్తి, ఏప్రిల్6 :  తుంగతుర్తి  మండలంలోని గ్రామాల్లో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని భక్తులు వేకువ జామున నిద్రలేచి స్థానమాచరించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయాల్లో సీతారాముల స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి తుంగతుర్తి రామాలయ నూతన చైర్మన్ ఎనగందుల సంజీవ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులుకాటూడి రామాచార్యులు ప్రత్యే కంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తల్లాడ కేదారి గుణగంటి రమేష్ మంజుల , రంగన్న, శ్రీకాంత్ నాయుడు బొంకూరి రమేష్, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు దొంగారి గోవర్ధన్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పుల రాంబాబు యాదవ్ ప్రవీణ్ రెడ్డి పెండెం రామ్మూర్తి అజయ్ కొండా రాజు, రాములు, ఉప్పుల శ్రీను, ఎనగందుల గిరి, అంబటి రాములు గణేషు, వెంకన్న, బండారు దయాకర్ పాలవరపు సంతోష్, తదితరులు పాల్గొన్నారు

మెతేలో

మోతే, ఏప్రిల్ 6:- ఆదివారం మండల పరిధిలోని గోపతాండ, నేరడవాయి రామాలయాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవంలో మాజీ ఎంపీపీ ఆశ శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో డీలర్ సీతారాములు, కొర్రలక్ పతి,గుగులోతు కిట్టు, మాజీ ఎంపిటిసి శ్రీరాములు, భూక్యనాగు, భూక్య బిక్కు,గు గులోతు భగవాన్, గుగులోతు పాండు, గుగులోతు లచ్చపతి,గుగులోతు రెడ్డి,గుగులోతుబాలు, భూక్య బాబు, భూక్య రామోజీ, గ్రామ యూత్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.